ప్రైవేట్ పాఠశాలలను ఆదుకోవాలి
కరీంనగర్,ఏప్రిల్25: తెలంగాణలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల అభివృద్దికి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) జిల్లా నేతలు పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలు పలు సమస్యలతో పాటు ప్రాపర్టీ టాక్స్‌ను 20 రెట్లు పెంచడంతో ఆర్థిక భారం మోయలేక పలు పాఠశాలలు మూసివేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. దీంతోపాటు విద్యుత్తు, నీటి బిల్లుల పన్నులను తగ్గించాలని, ప్రీప్రైమరీ తరగతుల అనుమతిని తీసుకోవాలని చేస్తున్న ఒత్తిళ్లను విరమించాలని, ఉపాధ్యాయులకు రెండు పడకల గదులు, ఆరోగ్య కార్డులు, బీమా సౌకర్యాలను అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.