ప్రైవేట్‌ పాఠశాలలపై మోజు తగ్గాలి

కరీంనగర్‌,జూన్‌20(జ‌నంసాక్షి): గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రల ఆలోచనా ధోరణి మారాలని ఉపాధ్యా సంఘాల నేతలు అన్నారు. పిల్లలను స్కూలుకు పంపడమే గాకుండా ప్రభుత్వ పాఠశాలలో  చేర్పించేందుకు ముందుకు రావాలన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులున్నా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపుతున్నారని అన్నారు. దీనివల్లనే ప్రైవేట్‌ విద్యవ్యాపారంగా మారిందన్నారు.  ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని సూచించారు. విద్యసంబరాలకు ఆచార్య జయశంకర్‌ పేరు నామకరణం చేసినప్పటికీ కొన్ని పాఠశాలల్లో ఆచార్య జయశంకర్‌ చిత్రపటాన్ని పెట్టడం లేదని, మరికొన్ని పాఠశాలలో కేవలం ఫ్లెక్సీలను మాత్రమే ఉపయోగిస్తున్నారని అన్నారు. సంబరాలు జరిగే పాఠశాలలో ఆయన చిత్రంపటంతో పాటు ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించాలని ఆయన సూచించారు.