ప్రైవేట్ బిల్లు రభసతో పరిష్కారం శూన్యం
ప్రైవేట్ బిల్లుపై రభస కారణంగా రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయమే తప్ప ఆశించిన ఫలితం దక్కేలా లేదు. కాంగ్రెస్ ఈ విషయంలో పట్టుబట్టినా అధికార బిజెపి ఏదో సాకు చూసి దానిని తిప్పికొడుతూ వచ్చింది. తాజాగా అది ఆర్థిక బిల్లంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనతో రేపటి శుక్రవారం కూడా దీనిపై చర్చ సాగుతుందన్న భరోసా లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక¬దాపై రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టినా ఫలితం కనిపించడం లేదు. దీంతో పోడియంను చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు నినాదాలతో రాజ్యసభను ¬రెత్తించారు. ఇది రాజ్యసభ రూల్స్ కు విరుద్ధమని చెప్పిన డిప్యూటీ ఛైర్మన్ కురియన్, ఈ శుక్రవారం చర్చకు తీసుకువద్దామని అన్నారు. దానికి అంగీకరించని కాంగ్రెస్ నేతలు ఆందోళన కొనసాగించారు. వచ్చే శుక్రవారం దీనిపై చర్చ, ఓటింగ్ పెడదామని అన్నారు. దీనిపై సీతారాం ఏచూరి మాట్లాడుతూ, సమస్యను పరిష్కరించాలని అనుకుంటే ఏపీకి ప్రత్యేక¬దా ప్రకటించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక¬దా ఇస్తున్నట్టు గతంలో ప్రధాని ఇక్కడే ప్రకటించారని, దానిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని, ఏపీకి ప్రత్యేక¬దా ఇస్తామని బీజేపీ ప్రకటిస్తే సమస్య పరిష్కారమవుతుందని, అధికార పార్టీని అందుకు ఆదేశించాలని ఆయన సూచించారు. అయితే సీతారం ఏచూరి అన్నంత ఈజీగా సమస్య లేదు. దానిని అమలు చేయాలంటే ఎన్నో సమస్యలు ఇంకా దానిచుట్టూ ముడిపడి ఉన్నాయి. అందుకే బిజెపి ప్రభుత్వం దీనిపై మాట మాత్రంగా అయినా హావిూ ఇవ్వడం లేదు. సరికదా ఇది ద్రవ్యబిల్లు కనుక రాజ్యసభలో చర్చకు ఆస్కారం లేదని జైట్లీ కొట్టి పారేశారు. ప్రత్యేక ¬దా బిల్లు ద్రవ్య బిల్లు అని, దీనిని లోక్ సభలో ప్రవేశపెట్టాలి తప్ప రాజ్యసభకు చర్చించే అధికారం లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనతో ఇప్పుడు దీని పర్యవసానం మరోలా ఉండేలా ఉంది. అంటే దీనిపై అధికరా పార్టీకి ఆసక్తి లేదని స్పష్టం అయ్యింది. ఇది రాజ్యాంగంలో ఉందని, ఏపీకి ప్రత్యేక ¬దా బిల్లు ద్రవ్యబిల్లు అని ఆయన స్పష్టం చేశారు. దీంతో ద్రవ్య బిల్లుపై చర్చించేందుకు రాజ్యసభకు అధికారం లేదని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ తెలిపారు. దీనిపై సీతారాం ఏచూరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ సభను తప్పుదోవపట్టిస్తున్నారని, ప్రైవేట్ మెంబర్ బిల్లును మనీ బిల్లుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక¬దా బిల్లు ఆయన చెబుతున్నట్టు ద్రవ్యబిల్లు అయితే డిప్యూటీ ఛైర్మన్ బిల్లును ఎందుకు స్వీకరించారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కురియన్ అది ద్రవ్యబిల్లా? కాదా? అన్నది గౌరవనీయ స్పీకర్ నిర్ణయిస్తారని అన్నారు. ఇదిలా ఉండగా భార తీయ జనతాపార్టీ సభ్యులపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామ చందర్రావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో తాను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ¬దా కోసం పెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుని చర్చకు రాకుండా బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని కేవీపీ నోటీసు ఇచ్చారు. నిజానికి ఇదంతా సమయం తినే సమస్య తప్ప పరిష్కారం చూపే అంశంగా కనిపించడం లేదు. ఇందులో రాజకీయాలు ఇమిడి ఉన్నాయి తప్ప సమస్యలు లేవు. విభజనకు సంబంధించి అనేక్ సమస్యలను ఇంకా నాన్చుతూనే ఉన్నారు. కాబట్టి అవన్‌ఈన పరిస్కారం అవుతాయన్న నమ్మకం కూడా లేదు. అలాగే పరిస్కరించాలన్న చొరవ అధికార బిజెపికి లేదు. ఆనాడు విభజన వేళ అధికారం తమ చేతుల్లో ఉన్నా జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ లాంటి నేతలు దూరదృష్టి ప్రదర్శించలేదు. అందుకే విభజన సమస్యలు రావణ కాష్టంలా రగులుతూనే ఉంటాయి. ప్రైవేట్ బిల్లు కేవలం శుక్రవారం మాత్రమే చర్చిస్తారు. ఈ విషయం కాంగ్రెస్‌కు తెలియంది కాదు. డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, బిల్లును వచ్చే శుక్రవారం చేపడతామని పదేపదే చెబుతున్న వేళ, కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే శుక్రవారం బిల్లును చేపట్టి తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహిస్తామన్న హావిూని విూరు ఇస్తారా? అంటూ డిప్యూటీ చైర్మన్‌ను సూటిగా ప్రశ్నించారు. అయితే, దీనికి కురియన్ సమాధానం చెప్పలేదు. అంటే ఆ రోజును బట్టి సమస్య ఉంటుంది. అందుకే వచ్చే శుక్రవారం కూడా దీనికి గ్యారెంటీ లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు మెంబర్ బిల్లును నిబంధనలకు విరుద్ధంగా శుక్రవారం మినహా మరోరోజు చర్చించలేమని కురియన్ స్పష్టం చేశారు. మొత్తంగా ఇప్పుడు సమస్యల మళ్లీ మొదటికి వచ్చింది. ఆనాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ ప్రత్యేక¬దా హావిూ ఇచ్చినా బిల్లులో పొందుపర్చలేదు. బిల్లులో లేదు కను తామెందుకు ఇవ్వాలన్న ధోరణిలో అధికార బిజెపి ఉంది. హావిూ ఇచ్చారు కనుక ఇవ్వాలని కాంగ్రెస్ వాదిస్తోంది. హావిూని బిల్లులో ఎందుకు పొందు పర్చలేదని బిజెపి విమర్శిస్తోంది. ఇలా విమర్శలు, ప్రతి విమర్శలు, వాదోపవాదాలతో రెండేల్లు గడిచాయి. ఈ రెండేళ్లలో అనేక సమస్యలకు పరిస్కారం దక్కలేదు. అలాగే ఇకముందు కూడా దక్కుతాయన్న భరోసా లేదు. కాబట్టి రాజకీయంగా ఇవి ఆయా పార్టీలకు ఉపయోఎగపడే అంశలే తప్ప ప్రజలకు మాత్రం ఉపయుక్తం కావు.