ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ట్రంప్
ఎన్నికల బరిలో దిగినప్పట్నుంచి వివాదాస్పదుడిగా విమర్శలెదు ర్కొన్న అమెరిగా అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్‌ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టకముందే అభద్రతా భావానికి లోనౌతున్నారా అన్న సందేహం అంతర్జాతీయంగా వెల్లు వెత్తుతోంది. ట్రంప్‌కు ఓట్లేసిన అమెరికన్‌లు తమ భావి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయినప్పటికీ ఆయనలో అభద్రతాభావం కనుమరుగు కావడంలేదు. తొలుత సొంత పార్టీ రిపబ్లికన్ల నుంచే ఆయన అభద్రతనెదుర్కొ న్నారు. అనంతరం ప్రజల విశ్వాసంపై సందిగ్ధానికి గుర య్యారు. విజయానంతరం కూడా ఆయనిప్పటికీ అదే అపనమ్మకంతో కొనసాగుతున్నారు. దక్షిణాసియా దేశా ల పట్ల ట్రంప్ వ్యవహారతీరు పలు సందేహాల్ని రేకెత్తిస్తోం ది. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్దిక, సామాజికాభివృద్ది సాధిస్తున్న చైనా, భారత్‌లంటే ట్రంప్‌లో అసహనం వ్యక్తమౌతోంది. ఎన్నికల్లో ఈ రెండు దేశాలకు చెందిన ఓటర్లకాయన అనేక హామీల్ని గుప్పిం చారు. వారి ఓట్ల కోసం పలురకాలుగా ప్రాధేయపడ్డారు. పాకిస్థాన్ పట్ల వ్యతిరేక వైఖరిని కనబర్చారు. చైనీయుల్ని పొగడ్తల్తో ముంచెత్తారు. భావి ప్రపంచ విజేతలు భారతీయులేనంటూ ప్రశంసించారు. మరోవైపు ముస్లింల పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. వార్ని టెర్రరిస్టులుగా పేర్కొన్నారు. భారత్, చైనాల్ని ఆయన శతృ దేశాలుగా పరిగణిస్తున్నారా అన్న సంకేతాలిస్తున్నారు. ఈ రెండు దేశాల్తోనూ ఆయన ప్రత్యక్ష వైరానికి తలపడ్డం లేదు. అలాంటి మాటలు కూడా ఎక్కడా చెప్పడంలేదు. అయితే పరోక్షంగా ఈ దేశాల శతృవుల్తో మిత్రత్వం నెర పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రోటోకా ల్‌ను కూడా ఉల్లంఘించి ఆయన పాక్ ప్రధాని షరీఫ్‌కు ఫోన్ చేశారు. పైగా ఈవిషయాన్ని తానే అమెరికా మీడి యాకు వెల్లడించారు. ఫోన్ సంబాషణలోనే షరీఫ్‌కు అనేక హామీలు గుప్పించారు. ఆ దేశ సమస్యల్ని పరిష్క రిస్తామన్నారు. ఇందుకు అవసరమైన సాధనసంపత్తిని సమకూరుస్తామన్నారు. ఇది దౌత్య సంప్రదాయం కూడా కానేకాదు. దాన్నికూడా ట్రంప్ ఉల్లంఘించారు.