ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం..
-పర్యావరణాన్ని కాపాడుదాం…..
-కోడిమాల శ్రీనివాసరావు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 11(జనం సాక్షి)
వరంగల్ లోని ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ఆఫీసర్ కొడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా ప్రోగ్రాం లో భాగంగా ఐకానిక్ ప్లేస్ అయినా 1000 పిల్లర్ టెంపుల్ లో స్వచ్ఛభారత్ పోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ ఈ.వో వెంకటయ్య గారు విచ్చేసి ఏవివి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చారిత్రాత్మక ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ మరియు ఇతర చెత్తాచెదారాన్ని క్లీన్ చేయడం చాలా సంతోషమని ఈ కార్యక్రమం నిర్వహించిన కొడిమాల శ్రీనివాసరావును అభినందిస్తున్నానని అన్నారు . కార్యక్రమంలో సేకరించిన 25 కేజీల సింగిల్ యూస్ ప్లాస్టిక్నును ఎన్ .వై. కే కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ వై కే వాలంటారు భరత్ ,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నగేష్, సదా హుమేరా, నవ్య ,ఆదిత్య, సుచిత్, సతీష్ మొదలగు వారు పాల్గొన్నారు.
Attachments area