ప్లాస్మా థెరఫీకి రక్తదానం దైవ ప్రార్థనతో సమానం
కరోనా నుంచి కోుకున్న.. తబ్లిగీ భక్తుకిది అరుదైన అవకాశం
పవిత్ర రంజాన్ మాసం… రోగు సేవకే కేటాయిద్దాం
మా మతం మానవత్వమని నిరూపిద్దాం
కోుకున్న కరోనా బాధితు ప్లాస్మా దానం చేయండి.. ప్రాణదాతుగా నివండి
కోుకున్న తబ్లిగి జమాత్ కార్యకర్తు ముందుకు రావాలిఆపత్కాంలో ఆదుకోవడాన్ని మించిన ప్రార్థనాఫం లేదుపవిత్ర రంజాన్ మాసంలో మహత్కార్యానికి సువర్ణావకాశం
‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం..
హైదరాబాద్, ఏపిల్ 25(జనంసాక్షి):చికిత్స కోసం మందుగానీ, వ్యాక్సిన్ గానీ లేని కరోనా వైరస్ భయంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భయాందోళనతో కాం గడుపుతున్నారు. ప్రజ ప్రాణాు కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయం లేక ఎన్నో దేశాు లాక్ డౌన్ ప్రకటించి కఠినంగా అము చేస్తున్నాయి. అయినప్పటికీ మూడు నెలలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితు సంఖ్య ఇరవై ఎనిమిది క్షు దాటింది, మరణా సంఖ్య రెండు క్షకు చేరువలో ఉంది. శనివారం నాటికి మన దేశంలో మొత్తం కరోనా బాధితు సంఖ్య 24942, మరణా సంఖ్య 779, కోుకున్న వారి సంఖ్య 5210 ఉంది. తెంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కరోనా బాధితు సంఖ్య 990, మరణా సంఖ్య 25, కోుకున్న వారి సంఖ్య 307 ఉంది. ఈ గణాంకాను గమనిస్తే దేశంలో దాదాపు పందొమ్మిది వే మంది కరోనా వైరస్ భాదితు చికిత్స పొందుతుండగా అందులో తెంగాణకు చెందిన ఆరు వంద యాభై ఎనిమిది మంది చికిత్స పొందుతున్నట్టు తొస్తుంది. కంటికి కనపడకుండానే ప్రపంచవ్యాప్తంగా ప్రజందరినీ ప్రాణభయంతో కట్టిపడేసిన కరోనా మహమ్మారిని అదుపుచేయడానికి మందుగానీ, వ్యాక్సిన్ గానీ లేనందున భాదితుకు ఇప్పుడు ప్లాస్మా థెరఫీ ఆశాజనకంగా కనిపిస్తుంది. ఈ థెరపీని చైనా, అమెరికా లాంటి దేశాు ఇప్పటికే ఉపయోగిస్తుండగా ఇప్పుడు ఈ చికిత్సా విధానాన్ని భారత్ కూడా ఆమోదించింది. రక్తం నుండి ఎర్ర రక్త కణాు, త్లె రక్త కణాను వేరుచేసిన అనంతరం మిగిలే జిగురు లాంటి పదార్థాన్ని ప్లాస్మా అంటారు. రోగి ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా (క్రిటికల్ స్టేజ్) ఉన్నప్పుడు ప్లాస్మా థెరఫీని ఆశ్రయిస్తారు. మొట్టమొదటి సారిగా ఈ థెరపీనీ 2014లో ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది. ఎవరైనా ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారు కోుకుంటే వారి రక్తంలో వైరస్‌ను చంపే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటి వారి నుండి ప్లాస్మా తీసి వైరస్‌తో బాధపడుతున్నవారికి ఎక్కిస్తే వాళ్లలోనూ రోగనిరోధక శక్తి పెరిగి ఆ వైరస్‌ను నిర్మూలిస్తుంది. దీంతో క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నవారు కూడా కోుకునే అవాకాశాు ఎక్కువ. గతంలోనూ వైద్యు ఈ పద్ధతిని నిర్వహించి విజయవంతమయ్యారు. దీంతో ఇప్పుడు కరోనా పేషంట్లను కాపాడటానికీ ఈ పద్ధతిని ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు తెంగాణ రాష్ట్రం వరకు చూసుకుంటే కరోనా భారినుండి కోుకున్న వారి సంఖ్యకు దాదాపు రెట్టింపు సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. అందులోనూ క్రిటికల్ స్టేజ్ లోకి వెళ్ళే భాదితు సంఖ్య తక్కువే ఉంటుంది. తెంగాణ రాష్ట్రంలో కరోనా భాదితులైనా, కోుకున్న వారైనా తబ్లిగీ జమాత్ కార్యకర్తతో పాటు వారి అనుయాయులే ఎక్కువ అని అందరికి తెలిసిన విషయమే. ఈ ఆపత్కాంలో కోుకున్న కరోనా భాదితు తమ ప్లాస్మాను చికిత్స పొందుతున్న కరోనా బాధితుకు అందిస్తే సాటివారికి ప్రాణదానం చేయడమే కాకుండా పవిత్ర రంజాన్ మాసంలో ఎందరికో ఆదర్శంగా నిలిచినవారవుతారు.