ఫార్మా పరిశ్రమలు తరలిపోకుండా చర్యలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఫార్మా  పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండ్రు మురళి తెలియజేశారు. నిట్‌ పీజ్‌ సెట్‌పై ఈ నెల 22న సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుననుసరించి ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ రూ. 71 కోట్లను ఇప్పటికే విడుదల చేసినట్లు స్పష్టం చేశారు.