ఫార్మా పరిశ్రమలో ప్రమాదం

జిన్నారం: మెదక్‌ జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామిక వాడలోని కేసులే ఫార్మా పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రియాక్టర్‌ వద్ద పైపు వూడిపోవటంతో రసాయనాలు కార్మికులపై పడి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి, మరొకరిని బాలానగర్‌లోని బీబీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆపరేటర్‌ నాగేశ్వరరావు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పరిశ్రమ ఆవరణ అంతా రసాయనాలతో నిండిపోవడంతో నివారించేందుకు పరిశ్రమ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ విషయమై కర్మాగారాల శాఖ, పోలీసులకు సమాచారం అందించారు.