ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్
` పియరీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, అన్నీ హుయిల్లర్‌లకు అత్యున్నత పురస్కారం
స్టాక్‌హోమ్(జనంసాక్షి): భౌతిక శాస్త్రంలో ఈ యేటి నోబెల్ బహుమతిని ప్రకటించారు. 2023 సంవత్సరానికి ముగ్గురికి ఆ అవార్డు దక్కింది. ద రాయల్ స్వీడిష్ అకాడవిూ ఆఫ్ సైన్సెస్ ఆ అవార్డును ప్రకటించింది. పియరీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, అన్నీ హుయిల్లర్‌లకు ఈ యేటి ఫిజిక్స్ నోబెల్ బహుమతి దక్కింది. కాంతికి చెందిన ఆటోసెకండ్ పల్స్‌లను పసికట్టే పద్ధతులను డెవలప్ చేసినందుకు ఆ ముగ్గురినీ నోబెల్ వరించింది. ఎలక్ట్రాన్ డైనమిక్స్ స్టడీలో ఈ పద్ధతులు కీలకం అయినట్లు రాయల్ స్వీడిష్ కమిటీ వెల్లడిరచింది.పరమాణువులు, అణువుల్లో ఎలక్ట్రాన్ల కదలికలు చాలా వేగంగా ఉంటాయని, వాటిని ఆటోసెకండ్స్‌లో కొలుస్తారు. ఆటోసెకండ్ అంటే ఒక సెకను అని, అది ఈ విశ్వం వయసుకు ఓ సెకండ్‌తో సమానమని పేర్కొన్నారు. ఆటోసెకండ్ లైటు ద్వారా ఎలక్ట్రాన్ల కదలికలను స్టడీ చేయవచ్చు. అయితే ఈ టెక్నాలజీ క్రమేణా అభివృద్ధి చెందుతున్నట్లు అకాడవిూ తన ప్రకటనలో తెలిపింది. పరమాణువుల్లో ఎలక్ట్రాన్ల లోకాన్ని పరిచయం చేసిన శాస్త్రవేత్తలకు ఈ యేటి నోబెల్ ఫిజిక్స్ అవార్డు దక్కుతుందని కమిటీ వెల్లడిరచింది.