ఫిబ్రవరి 2న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
– 12 న నోటిఫికేషన్
మోగిన గ్రేటర్ ఎన్నికల నగారా
12న నోటిఫికేషన్ విడుదల
12 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ
18న పరిశీలన,21న ఉపసంహరణ
ఫిబ్రవరి2న ఎన్నికలు..5న లెక్కింపు
అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
హైదరాబాద్,జనవరి 8(జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల నగారా మోగింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల సంఘం శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. ఫిబ్రవరి 2న జీహెచ్‌ఎంసీలో 150 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 12 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు.
18న నామినేషన్ల పరిశీలన జరుపుతారు. 21న నామినేషన్ల ఉపసంహరణ తరవాత ఫిబ్రవరి 2న ఎన్నికలు జరిపి ఫిబ్రవరి 5న ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఏదైనా వార్డులో అనివార్య కారణాలతో పోలింగ్ ఆగితే ఫిబ్రవరి 4న నిర్వహిస్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను 15రోజులకు కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవోపై హైకోర్టు గురువారం స్టే విధించిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను వెంటనే ప్రకటించాలని కోర్టు ఆదేశించడంతో శనివారంలోగా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికి ముందుగా శుక్రవారమే ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా అత్యంత వేగంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం విశేషం. షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల నియమావళి తక్షణం అమల్లోకి వస్తుందని ఎన్నికల అధికారి నాగిరెడ్డి తెలిపారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే ఫిబ్రవరి 4న నిర్వహిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తామన్నారు. ఇవిఎం ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈవీఎంల ద్వారానే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ కోసం 12వేల ఈవీఎంలను వినియోగించనున్నట్టు తెలిపారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనున్నట్టు తెలిపారు. పోలింగ్‌ను 30మంది ఐఏఎస్ అధికారులు పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. మొత్తం 7,757 పోలింగ్ కేంద్రాలున్నాయని..ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఐదుగురు సిబ్బంది ఉంటారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 3వేలకు పైగా సమస్యాత్మక ప్రాంతాలున్నాయని తెలిపారు. 3వేల కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు.
వార్డుల విభజన..రిజర్వేషన్లు ఖరారు
జీహెచ్‌ఎంసీం వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈమేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల వారీగా రిజర్వేషన్ల జాబితాను ప్రకటించింది. మొత్తం గ్రేటర్‌లోని 150 డివిజన్లలో అన్ రిజర్వ్‌డ్-44, జనరల్ (ఉమెన్)- 44, బీసీ (జనరల్)- 25, బీసీ (ఉమెన్) – 25, ఎస్సీ (జనరల్) -5, ఎస్సీ (ఉమెన్)- 5, ఎస్టీ జనరల్ (1), ఎస్టీ (ఉమెన్) -1 గా రిజర్వేషన్లు కేటాయించారు. వార్డుల రిజర్వేషన్ల వివరాలు ఇలావున్నాయి.
అన్ రిజర్వుడు
మల్లాపూర్, మన్సూరాబాద్, హయత్‌నగర్
బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, చంపాపేట్
లింగోజిగూడ, కొత్తపేట, చైతన్యపురి, గడ్డి అన్నారం
అక్బర్‌బాగ్, డబీర్‌పుర, రెయిన్‌బజార్, పత్తర్‌ఘట్టి
లలిత్‌బాగ్, రియాసత్ నగర్, ఉప్పుగూడ, జంగంమెట్
బేగం బజార్, మైలార్‌దేవ్‌పల్లి, జాంబాగ్, రాంనగర్
బంజారాహిల్స్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ
వెంగళరావునగర్, రహ్మత్‌నగర్, కొండాపూర్
గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్
కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట్, ఫతేనగర్
ఓల్డ్‌బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్
ఆల్విన్‌కాలనీ, సూరారం, ఆనంద్‌బాగ్ ఈస్ట్, మల్కాజ్‌గిరి
జనరల్ మహిళ (44)
ఎ.ఎస్.రావునగర్, నాచారం, చిలుకానగర్
హబ్సిగూడ, ఉప్పల్, నాగోల్, సరూర్‌నగర్
రామకృష్ణాపురం, సైదాబాద్, మూసారాంబాగ్
ఆజంపుర, మొఘల్‌పుర, ఐఎస్ సదన్, లంగర్‌హౌజ్
గన్‌ఫౌండ్రీ, హిమాయత్‌నగర్, కాచిగూడ, నల్లకుంట
బాగ్ అంబర్‌పేట్, అడిక్‌మెట్, గాంధీనగర్, ఖైరతాబాద్
వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, అవిూర్‌పేట్
సనత్‌నగర్, హఫీజ్‌పేట్, చందానగర్, భారతినగర్
బాలాజీనగర్, అల్లాపూర్, వివేకానందనగర్ కాలనీ
సుభాష్‌నగర్, కుత్భుల్లాపూర్, జీడిమెట్ల, ఆల్వాల్
నేరేడ్‌మెట్, వినాయక్‌నగర్, మౌలాలి, గౌతమ్‌నగర్
తార్నాక, సీతాఫల్‌మండి, బేగంపేట్, మోండా మార్కెట్
బీసీ జనరల్ (25)
చర్లపల్లి, చావునీ, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట
శాలిబండ, గోషామహల్, పురానాపూల్, దూద్‌బౌలీ
జహనుమా, రామ్‌నాస్‌పుర, కిషన్‌బాగ్, శాస్త్రిపురం
దత్తాత్రేయనగర్, కార్వాన్, నానల్‌నగర్, మెహిదీపట్నం
గుడిమల్కాపూర్, అంబర్‌పేట్, భోలక్‌పూర్, బోరబండ
రాంచంద్రాపురం, పటాన్‌చెరు, గాజుల రామారం
జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్
బీసీ మహిళ (25)
రామాంతాపూర్, ఓల్డ్‌మలక్‌పేట్, తలాబ్ చంచలం
గౌలిపుర, కూర్మగూడ, కంచన్‌బాగ్, బార్కాస్
నవాబ్‌సాహెబ్ కుంట, ఘాన్సీబజార్, సులేమాన్‌నగర్
అత్తాపూర్, మంగళ్‌హాట్, గోల్కొండ, టోలిచౌకి
ఆసిఫ్‌నగర్, విజయనగర్‌కాలనీ, అహ్మద్‌నగర్
రెడ్‌హిల్స్, మల్లేపల్లి, గోల్నాక, ముషీరాబాద్
ఎర్రగడ్డ, చింతల్, బౌద్ధనగర్, రాంగోపాల్‌పేట
ఎస్సీ జనరల్ (5)
కాప్రా, విూర్‌పేట్ హెచ్‌బీ కాలనీ, జియాగూడ
మచ్చ బొల్లారం, వెంకటాపురం
ఎస్సీ మహిళ (5)
రాజేందర్‌నగర్, కవాడిగూడ
అడ్డగుట్ట, మెట్టుగూడ, బన్సీలాల్‌పేట
ఎస్టీల రిజర్వేషన్
హస్తినాపురం – ఎస్టీ జనరల్
ఫలక్‌నుమా,- ఎస్టీ మహిళ