ఫిర్యాదుదారులకు సత్వరమే న్యాయం చేయాలని పోలీసులు అధికారులు ఆదేశించిన ఎస్పీ

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 20 (జనం సాక్షి);
బాధితుల ఫిర్యాదు ఆనంతరం పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలు, కేసు విచారణలో వాస్తవాలను, ఫిర్యాదుదారులకు వివరించడం తో పాటు వారికి సత్వర న్యాయం అందించేందుకు పోలీస్ అధికారులు కృషి చేయాలనీ జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కె. సృజన పోలీస్ అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న గ్రివేన్స్ కార్యక్రమం సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులపై బాధితుల అనుమానాలను నివృత్తి చేస్తూ పారదర్శకతను పెంపొందించాలని సూచించారు. వాస్తవ పరిస్థితులకు పరిశీలించి…
త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ సమస్య గల కారణాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్ధాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిర్యాదులో అధికంగా భూ వివాదాలు, కుటుంబ , వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు.
ప్లాట్ అక్రణకు సంబంధించి 1, తమ ఇంటికి ఉన్న వాటర్ కనెక్షన్ తొలగించారని 1,భూ కబ్జా కు సంభందించి 1, ఆన్లైన్ లో అగర్ బత్తి తయారీ మిషన్ తీసుకోవడంలో జరిగిన మోసం కు సంబంధించి 1,భర్త వేదింపులకు సంబందించి 1,దేవాలయ భూమిని బ్యాంక్ లో తాకట్టు పెట్టి లోన్ లు పొందారని 1,ఇతర అంశాలకు సంబంధించి 3 పిర్యాదులు వచ్చినట్లు ఆమె తెలిపారు.