ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
మనీలా,ఏప్రిల్22(జనంసాక్షి): ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైందని యూఎస్‌జీఎస్ తెలిపింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకొని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. భూకంప కేంద్రాన్ని మనీలాకు వాయువ్య దిశగా 60 కిలోవిూటర్ల దూరంలో గుర్తించారు. భూప్రకంపనలతో మనీలాలో ప్రజలు ఇళ్లు,కార్యాలయాల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.