ఫిలిప్పీన్స్‌లో స్వల్ప భూకంపం
ప్రమాదంలో ఇద్దరు మృతి
మనీలా,జూలై27(జనంసాక్షి
): ఫిలిప్పీన్స్‌లో బుధవారం భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇద్దరు మరణించగా,12మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.1 నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం తర్వాత కూడా పలుప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని పేర్కొంది. ªపజోన్ ప్రధాన ద్వీపంలోని పర్వత ప్రావిన్స్ అబ్రాను బుధవారం ఉదయం 8:43 గంటలకు భూకంపం సంభవించింది. రాజధాని మనీలా నగరానికి 300 కిలోవిూటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఎత్తైన టవర్లు ఈ భూకంపం వల్ల కంపించాయి. ఈ భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై తమ భవనాల నుంచి వెలుపలికి పరుగులు తీసినట్లు అధికారులు తెలిపారు. అధికారి చెప్పారు. భూకంపం చాలా బలంగా ఉందని పోలీసు మేజర్ ఎడ్విన్ సెర్గియో చెప్పారు.భూకంపం వల్ల పోలీసు స్టేషన్ భవనంలో చిన్న పగుళ్లు ఏర్పడ్డాయని ఎడ్విన్ వివరించారు.