ఫుట్‌పాత్ ఆక్రమణలపై కఠినచర్యలు
జిహెచ్‌ఎంసి చర్యలతో సత్ఫలితాలు
హైదరాబా,మార్చి5(జనంసాక్షి): ట్రాఫిక్ ఉల్లంఘనుల నడ్డి విరిచేందుకు రంగం సిద్ధమవుతోంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం మార్గదర్శకాలను అనుసరించి సవరించిన మోటారు వాహనాల చట్టం నిబంధనల అమలుకు నగర పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల నగరంలో పెద్ద ఎత్తున కూల్చివేతుల చేపట్టారు. అధికారులు ఎవరికి లొంగకుండా కూల్చివేతలు చేపట్టారు. ప్రధానంగా పుట్‌పాత్ వ్యాపారుల కారణంగా కూడా రోడ్డు ప్రమాదాలు పెరగుతున్నాయని గుర్తించారు. అందుకే విచ్చిలవిడిగా ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు. వారికి నచ్చచెప్పి అక్కడి నుంచి తరలించే ప్రయత్నాల్లో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ నిబంధనల్లోని పాయింట్ల విధానంపై ముందుగా వాహనదారుల్లో అవగాహన కల్పించి తరవాత చర్యలకు పూనుకున్నారు. ఈ విధానంలో మందుబాబులు, గొలుసు దొంగలతోపాటు ప్రమాదాల్లో మరణాలకు కారకులయ్యే వారికి చుక్కలు కనిపించనున్నాయి. రేసింగ్‌లకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.