ఫుడ్‌ పార్కుల రద్దుపై రాహుల్‌ ఆగ్రహం

5

డిల్లీ మే7(జనంసాక్షి): భూ సేకరణ బిల్లు, రైతు సమస్యలపై లోక్‌ సభలో ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ? యూపీలోని అమేథీలో ఫుడ్‌ పార్క్‌ రద్దుపై మండిపడ్డారు. అమేథీలో ఫుడ్‌ పార్కు ఏర్పాటు కోసం యూపీయే హయాంలో చేసిన ప్రతిపాదనను మోడీ సర్కారు రద్దుచేయడం దారుణమన్నారు. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్న రాహుల్‌? అమేథీలో ఫుడ్‌ పార్క్‌ ఉంటే పేద రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.

ఐతే, రాహుల్‌ కు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రాహుల్‌ కు రైతుల గురించి పెద్దగా తెలియదన్న ఆయన? తాను గ్రావిూణ ప్రాంతం నుంచి వచ్చినవాన్నని, రైతు సమస్యలపై తనకు మంచి అవగాహన ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం ఎప్పటికీ రైతులను ఇబ్బందిపెట్టే పనులు చేయదని రాజ్‌ నాథ్‌ స్పష్టం చేశారు.