ఫెడరర్‌తో కోహ్లి
సిడ్నీ: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన అభిమాన టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెడరర్‌ను సోమవారం కలుసుకున్నాడు. ఈసందర్భంగా తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఫెడరర్‌ను కలిసిన ఈ రోజును నేనెప్పటికీ మరిచిపోలేను. కోర్టు బయటా.. లోపల ఆయన చాలా గొప్పవాడు. తను ఎప్పటికీ దిగ్గజమే’ అని ఈ స్విస్ స్టార్‌తో కలిసి దిగిన ఫొటోతో ట్వీట్ చేశాడు కోహ్లి. ఆస్ట్రేలియాలోనే ఉన్న ఫెడరర్ ఆదివారం బ్రిస్బేన్ ఓపెన్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. కోహ్లితో పాటు ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్ కూడా టెన్నిస్ స్టార్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
కోహ్లిని సుదీర్ఘకాలం కెప్టెన్‌గా కొనసాగించాలి: ద్రవిడ్
భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని భవిష్యత్ అవసరాల దృష్ట్యా సుదీర్ఘకాలం కొనసాగించాలని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ప్రస్తుతం విరాట్ ప్రారంభ దశలోనే ఉన్నాడని, అయితే జట్టును నడిపించగలనని నిరూపించుకున్నాడని ప్రశంసించాడు. జట్టుకు చాలా ఏళ్లు సేవలందించగల నైపుణ్యం అతడిలో ఉందన్నాడ