ఫేస్బుక్లో మమతా బెనర్జీ
ఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన అభిప్రాయాల ప్రకటనకు సోషల్ నెట్వర్కింగ్ సైట్ల సహకారం తీసుకుంటున్నారు. నిన్న రాత్రే ఆమె తాజాగా ఫేస్బుక్ ఎకౌంట్ ప్రారంభించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్ కలాంని తానెందుకు కోరు కుంటున్నదీ తొలి పోస్టులోనే ఆమె వివరించారు. కలాం లాంటి వ్యక్తుల నాయకత్వమే ఈ ప్రజాస్వామ్య దేశానికి అవసరమని తమ పార్టీ భావిస్తోందని, తమ అభిప్రాయానికి అందరూ మద్దతివ్వాలని ఆమె తెలిపారు.