ఫేస్‌బుక్‌లో శిశువు 8 లక్షలకు అమ్మకం

లూథియానా,ఏప్రిల్‌24 :ఫేస్‌బుక్‌..సమస్యలపై స్పందించేందుకు,ఉద్యమాల్లో యువతను ఏకం చేసెందుకు మాత్రమే కాదు.ఏకంగా చిన్నారులను అమ్మేందుకూ పనికొస్తోంది.లూథియానాలో కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇందుకు సాక్షిగా నిలిచింది.నూరీ అనే మహిళ ఇటీవల స్థానిక ఆస్పత్రిలో ఏప్రిల్‌ 3న బాబుకు జన్మనిచ్చింది.ఏప్రిల్‌ 10న తన బాబు కనిపించకపోయేసరికి పోలీసులను ఆశ్రయించింది.ఆస్పత్రిలోని నర్స్‌ సునితతో పాటు,మరో ఉద్యోగి గురుప్రీత్‌సింగ్‌తో కలిసి నూరీ తండ్రి అయిన ఫిరోజ్‌ ఖాన్‌ రూ.8 లక్షలకు బాబును అమ్మాడని పోలీసులకు తెలిసింది.దీంతో ఆ ముగ్గురినీ వారు అరెస్ట్‌ చేశారు.

బాబును కొన్న ఢిల్లీ వ్యాపారవేత్త అమిత్‌ కుమార్‌ ఇంటిపై దాడి చేశారు.అతడినీ అరెస్ట్‌ చేసి బాబును నూరీకి అప్పగించారు.బాబు ఫోటోను అమ్మకానికి ముందు గురుప్రీత్‌సింగ్‌ ఆన్‌లైన్‌లో పెట్టినట్టు తెలిసిందని పోలీసులు చెప్పారు.నూరీపి తన భర్త విడిచి పెట్టడంతో ఆమెకు రెండో పెళ్లి చేసేందుకు యత్నించి,బాబును విక్రయించినట్టు ఫిరోజ్‌ ఖాన్‌ ప్రాథమిక విచారణలో వెల్లడించాడన్నారు