ఫ్రాన్స్‌ కొత్త ప్రధానిగా బెర్నార్డ్‌ కజెనూవ్‌

1481015106385ప్రస్తుతం ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న బెర్నార్డ్‌ కజెనూవ్‌ను కొత్త ప్రధాన మంత్రిగా నియిమంచినట్లు అధ్యక్షులు ఫ్రాంకోయిస్‌ హోలాండే కార్యాలయ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రధాన మంత్రిగా ఉన్న మాన్యుల్‌ వాల్స్‌ వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో బెర్నార్డ్‌ను కొత్త ప్రధానిగా నియమించారు. బెర్నార్డ్‌కు బలమైన వ్యక్తిత్వ మున్నదని, దేశ వ్యవహారాలలో అనుభవమున్నదని అందుకే ఆయనను ప్రధాన మంత్రిగా నియమిస్తున్నామని హోలాండే కార్యాలయ వర్గాలు తెలిపాయి. మాన్యుల్‌ వాల్స్‌ అధ్యక్ష ఎన్నికలలో సోషలిస్టు పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు.