ఫ్లూటో రహస్యాలు నాసా గుప్పిట్లో

3

హైదరాబాద్‌: అంతరిక్ష పరిశోధనాసంస్థ నాసా పంపిన అంతరిక్ష రీ|క న్యూహారిజోన్స్‌ నేడు ప్లూటో గ్రహానికి దగ్గరగా చేరుకుంది. దీనిద్వారా నాసా మొట్టమొదటి సారిగా ప్లూటో గ్రహాన్ని అతి దగ్గరగా తీసిన ఫొటోలను విడుదల చేసింది. నాసా పరిశోధనకు గుర్తింపుగా సెర్చింజన్‌ గూగుల్‌ ప్లూటో గ్రహంపై ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. పియానో పరిమాణంలో ఉండే ఈ అంతరిక్ష విమానం ప్లూటో దగ్గరగా తిరుగుతున్నట్లు కనిపించే యానిమేషన్‌ డూడుల్‌ను రూపొందించింది. 1930లో ప్లూటోను శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్లూటో అతిదగ్గరి చిత్రాన్ని మంగళవారం నాసా విడుదల చేసింది.