ఫ్లై ఓవర్ నుంచి కిందపడ్డ కారు, ముగ్గురు మృతి
హైదరాబాద్ అల్వాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే వంతెనపై బైక్ ను ఢీకొన్న కారు.. అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు గాయపడ్డారు. హకీంపేటలో ఓ పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను కృష్ణమాచారి, కమిలినిగా గుర్తించారు.