*బంకమన్నుతో దేశ నమూనా*

నేరేడుచర్ల జనంసాక్షి న్యూస్.పట్టణంలోని పినాకిల్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులు బంకమన్నుతో తయారు చేసిన భారతదేశ నమూనా (పటమును) దాని నైసర్గిక స్వరూపము విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకట్టుకున్నదని పినాకిల్ స్కూల్  కారెస్పాండెంట్ మదర్ గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా మదర్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు స్థానిక చెరువు నుంచి బంకమన్నును సేకరించి వారి సోషల్ స్టడీస్ మొదటి పాఠముకు సంబంధించిన ప్రాజెక్టు వర్క్ ను నాలుగు రోజులు కష్టపడి భారతదేశ పట నమూనాను తయారు చేశారని తెలిపారు. ఈ నమూనాలో హిమాలయాలు, జీవనదులు, దక్షిణ ప్రాంత నదులు, దక్కన్ పీఠభూములు, థార్ ఎడారి, తూర్పు, పశ్చిమ కనుమలు, తూర్పు తీర ప్రాంత మైదానాలు గుర్తించారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులను, ఉపాధ్యాయులను స్కూల్ రెస్పాండెంట్ మదర్ అభినందించారు.