బంజారా భవనం ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు.
తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు సెప్టెంబర్ 17(జనంసాక్షి)
హైదరాబాద్ నడిబొడ్డున బంజా భవనం ఏర్పాటు చేయడం పట్ల తాండూరు నియోజక వర్గ గిరిజన సోదరులు హర్షం వ్యక్తం చేశారు .శనివారం హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో తెలంగాణ ప్రభుత్వం 25 కోట్ల వ్యహంతో నిర్మించిన బంజారా భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో ఎక్కడ లేని విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం బంజారా భవనం నిర్మించడం ఎంతో గర్వకారణం అని కొని ఆడారు ముఖ్యమంత్రి కెసిఆర్ కు గిరిజన నాయకులు రుణపడి ఉంటామని అన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ వెంట మున్సిపల్ కౌన్సిలర్ భీమ్ సింగ్ రాథోడ్ కోఆప్షన్ మెంబర్ వెంకట్ రాము నాయక్, కుమ్మరపల్లి సర్పంచ్ శీను నాయక్, టిఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు దేవేందర్ నాయక్, మాజీ ఎంపీపీ రాజు నాయక్, మాజీ సర్పంచ్ బాలునాయక్,
రెడ్యానాయక్ తదితరులు ఉన్నారు.