బకాయిలు చెల్లించాలని వ్యాపారి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్‌: స్థానిక ఇరిగేషన్‌ ఈఈ కార్యాలయంలో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ప్రకాష్‌ అనే జిరాక్స్‌ సెంటర్‌ యజమానికి నీటి పారుదలశాఖ అధికారులు 4.25 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అది ఎంతకీ చెల్లించకపోవడంతో తనకు స్టేషనరీ బిల్లులు వెంటనే ఇవ్వాలంటూ గదిలోకి వెళ్లి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలిసులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.