బక్రీద్‌ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): బక్రీద్‌ సందర్భంగా రాజధాని హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి. నేడు బక్రీద్‌ కారణంగా విూరాలం టాంక్‌ ఈద్గా, బాలంరాయ్‌ ఈద్గా, సికింద్రాబాద్‌ ఈద్గాల వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈద్దా మిరాలం టాంక్‌లో ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల ప్రాంతంలో ప్రార్థనలకు వెళ్లే వాహనాలను పురాణాపూల్‌, కమాటిపురా, కిషన్‌బాగ్‌, బహదూర్‌పుర క్రాస్‌ రోడ్స్‌ విూదుగా మళ్లిస్తారు. ఈద్గా దారిలో సాధరణ ట్రాఫిక్‌ను బహదూర్‌పుర క్రాస్‌ రోడ్స్‌ లేదా కిషన్‌బాగ్‌ లేదా కమాటిపురాల విూదుగా మళ్లిస్తారు.శివంపల్లి నుంచి మిరాలం ఈద్గాలో ప్రార్థనల కోసం వెళ్లే వాహనాలను ఉదయం 9.30 గంటల వరకు అనుమతిస్తారు.సీటీఓ నుంచి బాలంరాయ్‌కు వెళ్లే వాహనాలను క్లాసిక్‌ గార్డు రోడ్డు విూదుగా కాకుండా రాజీవ్‌ గాంధీ విగ్రహం నుంచి లీ రాయల్‌ ప్యాలెస్‌ జంక్షన్‌ విూదుగా మళ్లిస్తారు. అన్నానగర్‌ నుంచి వచ్చే వాహనాలను కూడా క్లాసిక్‌ గా/-డ్గం/న్స్‌ విూదుగా మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు అమలులో ఉంటాయి.