బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి – ప్రైవేటు వద్దు… ప్రభుత్వం ముద్దు… – పిఆర్టియు అధ్యక్షులు వెంపటి సీతారాములు

డోర్నకల్ జూన్ 4 జనం సాక్షి

బడి ఈడు వయస్సు ఉన్న పిల్లలను గుర్తించి  పాఠశాలలో చేర్పించుటకు బొడ్రాయి తండా పాఠశాల ఉపాధ్యాయులు శనివారం శ్రీకారం చుట్టారు.పంతులు బృందాలుగా విడిపోయి గ్రామాన్ని జల్లెడ పడుతున్నారు.ప్రస్తుతం15 మంది బడిఈడు పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్చుటకు తల్లిదండ్రుల నుంచి హామీ తీసుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ తేజావత్ గమీ రాజు ఇంటి ఆవరణలో గ్రామస్తులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పిఆర్టియు మండల అధ్యక్షులు,ఉపాధ్యాయుడు వెంపటి సీతారాములు మాట్లాడుతూ… నేటి సమాజంలో ప్రతిఒక్కరికి చదువు ఎంతో ముఖ్యమన్నారు.సమాజం అభివృద్ధి చెందాలంటే నూరుశాతం అక్షరాస్యత సాధించాలన్నారు.తల్లిదండ్రులు,సంరక్షకులు బాధ్యతగా తీసుకొని బడి ఈడు వయస్సు ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల విద్యను అందుబాటులోకి తీసుకువచ్చింది అన్నారు.చక్కటి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రైవేటు వద్దు… ప్రభుత్వం ముద్దు అని నినదించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజీజ్, సత్యనారాయణ,మాధవి,అప్పిరెడ్డి,ఉప సర్పంచ్ భాస్కర్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.