-బతుకమ్మలు, బోనాలతో మహిళల స్వాగతం
ఈబహిరంగ సభలో టీఆర్‌ఎస్ అధినేత దాదాపు 25 నిముషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. జమ్మికుంట సమావేశం ముగించుకున్న అనంతరం ఆయన పెద్దపల్లికి వచ్చారు. టీఆర్‌ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు రాకేశ్ కుటుంబాన్ని పరామర్శించి నిట్టూర్, నిమ్మనపల్లి వెంకవూటావుపల్లి కాచాపూర్, వడ్కాపూర్ గ్రామాల మీదుగా జూలపల్లికి చేరుకున్నారు. జూలపల్లి బస్టాండ్ నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సూమారు 3వేల బోనాలతో తరలివచ్చారు. గంగాద్దులు, ఒగ్గుడోలు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సభకు సూమారు 15వేలమంది వరకు హాజరైనట్లు అంచనా పెద్ద ఎత్తున తరలివచ్చిన టీఆర్‌ఎస్ నాయకులు. కార్యకర్తలు. తెలంగాణవాదులనుద్దేశించి కేసీఆర్ ప్రసంగం ఆకట్టుకుంది. 25నిముషాల పాటు ప్రసంగించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో సమైక్యపార్టీలకు బుద్దీచెప్పాలని కోరారు.