బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన – ఎమ్మెల్యే మెచ్చా

అశ్వరావుపేట సెప్టెంబర్ 22( జనం సాక్షి )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని నారయణపురం లో గురువారం రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు.

ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆడపడుచు లు దసర పండుగ నాడు కొత్త చీర కట్టుకుని బతుకమ్మ అడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళను, అక్కా చెల్లెళ్ళుగా భావించి ఈ చీరలను పంపిణి చేసే ఈ బ్రహొత్తర మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనీ, అలాగే ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిందనిఆయన అన్నారు. తెరాస ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందనీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి రుణపడి ఉండాలని. ఏ రాష్ట్రంలో లేని అభివృద్ది మన రాష్ట్రంలో జరుగుతుంది అని ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు అన్నారు.ప్రతి పేద కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం అని. ఈ దసరా పండుగ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30రకాల వెరైటీలు,240 డిజైన్లు,800 కలర్ కాంబినేషన్ లతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణి కార్యక్రమం చేపట్టారని ఆయన తెలిపారు, అలాగే మన అశ్వారావుపేట మండలం లో సుమారు 14480 చీరలు వస్తాయని తెలిపారు, అలాగే ఇంకా ఎవరైనా ఆసరా పెన్షన్ రాని వారు ఉంటె మళ్ళీ ధరకాస్తు చేసు కోవాలని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, తెరాస పార్టి మండల అధ్యక్షులు బండి పుల్లారావు, కార్యదర్శి జూజ్జురు వెంకన్న,సర్పంచ్ కంగల పరమెష్,ఎంపిటిసి రమేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, నారయణ పురం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చిన్నంసెట్టీ వెంకట నరసింహం, తాసిల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీవో విద్యాధర రావు, ఎంపీ ఓ సీత రామరాజు, సీఐ బాలకృష్ణ, ఎస్సై చల్లా అరుణ, చందా లక్ష్మి నర్సయ్య, మండల నాయకులు మోహన్ రెడ్డి, తాడేపల్లి రవి, ప్రకాష్ మాస్టర్, నులాకాని శ్రీనివాస్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్, బిర్రంవెంకటేశ్వరరావు, ఆకుల శ్రీను,పసుపులేటి,ఫణీంద్ర,ఆవుల చిన్ని, తుంపాటి రమేష్,మరియు మండల నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.