బదిలీపై వెళ్తున్న డి.టి.డి. ఓ. దిలీప్ కుమార్ సమర్థవంతమైన సేవలు అందించారు -కలెక్టర్ శశాంక

మహబూబాబాద్ బ్యూరో-జూన్10(జనంసాక్షి)

బదిలీపై వెళ్తున్న డి.టి.డి. ఓ. దిలీప్ కుమార్  జిల్లాలో సమర్థవంతమైన సేవలు అందించారని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి దిలీప్ కుమార్ బదిలీ సందర్భంగా కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, ఎం.డేవిడ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ, జిల్లా ఖచ్చితంగా ఒక మంచి అధికారిని వదులుకోవడం భాదాకరమని, కాని తాను కోరుకుంటున్న స్థానానికి, కోరుకున్న జిల్లాకు వెళ్తున్నందుకు ప్రత్యేకంగా సంతోషంగా ఉందని, శుభాకాంక్షలు తెలిపారు. 2017 బ్యాచ్ గ్రూప్ 1 అధికారి అయిన దిలీప్ తో సహా రాష్ట్రంలో మొత్తం ముగ్గురు  ఉండగా, అందులో ఇద్దరితో పనిచేసే అవకాశం నాకు దక్కిందని అన్నారు. పని పట్ల ఎంతో నిబద్దతతో కలిగి ఉంటారని, ఏ పనైనా  సమర్దవంతంగా నిర్వహించగలిగే అధికారి అని, తన శాఖ యొక్క  పని బాద్యతలే కాకుండా, ఇతర శాఖల పనిని ఇచ్చినా చాలా సమర్దవంతముగా నిర్వహించేవారని, జిల్లా అధికారులలో చాలా చురుకుగా పనిచేసే కొందరు అధికారులలో దిలీప్ ఒకరని, అలాంటి అధికారుల వల్ల శాఖాపరంగా  జరిగే పనులు త్వరగా జరుగుతాయని, ఎవరికైనా పేద వారికి న్యాయం కోసం పని  జరుగుటలో ముందుండే వ్యక్తి అని, పనే ముఖ్యంగా భావించే వ్యక్తీ అని, అందరితో కలిసి పోయి చురుకుగా పని చేసే అధికారి అని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు బదిలీ అయినందున అక్కడ  ఎక్కువ ఆదివాసీలు ఉన్నందున తన  సేవలు ఎంతో అవసరమని, ఐటిడిఏ ప్రాంతం తన సేవలతో మెరుగు పడుతుందని, ప్రొఫెషనల్ గా కూడా తను సంతృప్తి చెందుతారని నమ్ముతూ, అన్ని అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ మరింత అభివృద్ధి, పేరు సాధించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ మాట్లాడుతూ , తక్కువగా మాట్లాడి ఎక్కువ పనిచేసే అధికారి అని, జిల్లాలో మంచిగా పనిచేసే అధికారి అని తెలిపారు. అదిలాబాద్ జిల్లాకు బదిలీ అయినందున అక్కడి గిరిజన, ఆదివాసీ ప్రజలకు మంచి సేవలందించాలని, ఎక్కడకు వెళ్ళిన తన యొక్క  సేవలతో  ప్రజలకు దగ్గరవ్వాలని కోరుకుంటున్నాననీ అన్నారు. గిరిజన సంక్షేమ అధికారి దిలీప్, మాట్లాడుతూ అధికారిగా నాపై కలెక్టర్ నమ్మకంతో అప్పజెప్పిన పనిని సమర్దవంతముగా నిర్వహించానని అనుకుంటున్నానని, నా ఉద్యోగ భాద్యతలలో పాలుపంచుకున్న నా తోటి ఉద్యోగులకు అబినందనలు తెలుపుకుంటున్నానని, మనము ఆఫీసులలో, మీటింగులలో మాట్లాడుకునే, అనుకునే అంశాలు, విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాల్చడంలో కొంత మేర లోటుపాట్లను సరిదిద్దుకోవాలని తన ఆలోచనను తెలియజేశారు. కలెక్టర్ కు, తనతో పనిచేసిన అధికారులకు, కార్యాలయ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సహచర జిల్లా ఉద్యోగులు, సిబ్బంది ప్రభుత్వ కార్యక్రమాల అమలులో దిలీప్ కుమార్ తో కలిసి పని చేసిన అనుభవాలను తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్తున్న దిలీప్ ను ఘనంగా జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు