బద్రీనాథ్‌లో ఇప్పటికీ 3వేల మంది యాత్రికులు
ఉత్తరాఖండ్ : బద్రీనాథ్‌లో ఇప్పటికీ 3వేల మంది యాత్రికులు చిక్కుకుని ఉన్నట్లు సైన్యం ప్రకటించింది. కేదార్‌నాథ్‌లో వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికీ కొండచరియలు విరిగిపడుతున్నాయి. కేదార్‌నాథ్‌లో గాలింపు పూర్తి కావడంతో ఇంటో టిబెటన్ సరిహద్దుదళాలు వెనక్కి తిరిగి వచ్చాయి. డెహ్రాడూన్‌లో వాతావరణం అనుకూలించక పోవడంతో బద్రీనాథ్‌లో చిక్కుకున్న యాత్రికులను వైమానికదళ హెలికాప్టర్లు చమౌలి జిల్లా గౌచర్‌కు తరలిస్తున్నాయి. గౌచర్ నుంచి హరిద్వార్, రిషికేశ్, డెహ్రాడూన్‌లోని శిబిరాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేదార్‌నాథ్‌లో మృతులకు అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటన జరిగి దాదాపు 10 రోజులు దాటడంతో మృతదేహాలు కుళ్లిపోయాయి.