బయ్యారంలో తెలంగాణ గ్రామీణ క్రీడా మైదాన ప్రాంగణం ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియ*
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ సందర్బంగా సాకరమైన చిరకాల కల*
బయ్యారం,జూన్ 02(జనంసాక్షి): గురువారం బయ్యారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ తెలంగాణ గ్రామీణ క్రీడా మైదాన ప్రాంగణం
ప్రారంభం చేశారు. ఈ తెలంగాణ గ్రామీణ క్రీడా మైదానం ఏర్పాటు కోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,బయ్యారం లోని పూర్వ విద్యార్థుల సమ్మేళనం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ…తెలంగాణ ప్రజలకు ఆవిర్బావ శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడలు మానవిక జీవన విధానంలో ప్రాముఖ్యత సంతరించుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలో ఒక క్రీడా మైదానం ఉండాలని ఆదేశాల మేరకు క్రీడా మైదాన కల సాకారమయిందని, యువత యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ క్రీడా మైదానానికి కావాల్సిన మెరుగైన సదుపాయాల కోసం విద్యుత్ స్తంభాలను, చుట్టూ ప్రహరీ, వృద్ధులు మహిళల కోసం వాకింగ్ ట్రాక్ ను పూర్వ విద్యార్థుల కోరిక మేరకు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. జెడ్పి చైర్ పర్సన్ బిందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ… ఎండాకాలంలో వరి కోసిన తర్వాత పొలాలలో తప్ప క్రీడలు ఆడుకోవడానికి ప్రదేశం లేనటువంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామగ్రామాన క్రీడాప్రాంగణం ఏర్పాటుకు ఆదేశాలు చాలా సంతోషకరమైన విషయమని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలుపుతున్నానని, క్రీడా మైదానాలకు సంబంధించిన ఫండ్స్ ఇప్పటికే విడుదలై ఉన్న కారణంగా రాబోయే రోజుల్లో క్రీడా మైదానం కి సంబంధించిన పరికరాలు, ఓపెన్ జిమ్ సెంటర్ ఏర్పాటు జరగబోతుందని తెలియజేశారు. ప్రయాణంలో గొప్పగొప్ప క్రీడాకారులు ఉన్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఎంపీటీసీ తిరుమల శైలజా రెడ్డి మాట్లాడుతూ… కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ప్రతి గ్రామానికి క్రీడా మైదానం ఏర్పాటు చేయడం హర్షణీయమని, క్రీడామైదానం వల్ల క్రీడాకారులకు యువతకు చాలా ఉపయోగకరమని, బయ్యారంలో క్రీడా మైదానం వల్ల చిరకాల కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. బయ్యారం గ్రామపంచాయతీ సర్పంచ్ దనసరి కోటమ్మ మాట్లాడుతూ… అందరి సమిష్టి కృషి ఫలితంగా బయ్యారంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసుకోవడం సంతోషాకరమని, గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణం ఏర్పాటు లక్ష్యంగా ముఖ్యమంత్రి ముందుకు వెలుతున్నారని ఇది ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు.బిళ్ళకంటి సూర్యం మాట్లాడుతూ… బయ్యారంలో రాష్ట్రస్థాయి క్రీడాకారులు ఉన్నప్పటికీ ప్రోత్సాహకం లేకపోవడంవల్ల అడుగు స్థానంలో ఉన్నారని, అటువంటి సమయాల్లో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా ఈ విషయంపై గ్రామ సభలో చర్చించామని, ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల కల సాకారం అయిందని హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ కృషి ఫలితంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నాలుగు లక్షలు రూపాయలతో క్రీడా మైదానం మట్టితో చదును చేశామని, ఇంకా ఇందులో కాంపౌండ్ వాల్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేని కోరారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ చలపతిరావు, ఎమ్మార్వో రమేష్, ఉపసర్పంచ్,తెరాస వైస్ ప్రెసిడెంట్ తాత గణేష్,పాక్స్ చైర్మన్ మూలమాధుకర్ రెడ్డి,తెరాస అధికార ప్రతినిధి సంకు సత్తిరెడ్డి,పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.