బయ్యారంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

బయ్యారం,అక్టోబర్31(జనంసాక్షి):
సోమవారం బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఉక్కు మనిషి శ్రీమతి ఇందిరా గాంధీ 38 వ వర్ధంతి సందర్బంగా పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంబాల ముసలయ్య మాట్లాడుతూ భారత దేశ మొట్టమొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ  బడుగు బలహీన వర్గాల కోసం గరిభీ హఠావో, 20 సూత్రాల పథకం, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, వంటి ఎన్నో జనరంజక పథకాలని తీసుకువచ్చి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకొన్న మహా నేత ఇందిరా గాంధీ అన్నారు.జనరంజక పాలన చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందని,ఇందిరా గాంధీ ఆశయ సాధణ కోసం నాయకులు,కార్యకర్తలు పాటు పడి  రాహుల్ గాంధీని భారత ప్రధాని చేయడమే లక్ష్యంగా, కాంగ్రెస్ పార్టీకోసం పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో బయ్యారం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గట్ల గణేష్, రామచంద్రాపురం ఎంపీటీసీ భూక్యా లక్ష్మి,మండల మహిళా అధ్యక్షురాలు తగిర నిర్మలా రెడ్డి,ఎస్టీ సెల్ మాజీ మండల అధ్యక్షులు గుగులోత్ రాంకోటి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చల్లగుండ్ల వెంకట నారాయణ,జగ్గుతండా గ్రామ కార్యదర్శి బాను, ఇర్సులాపురం యూత్ కాంగ్రెస్ నాయకులు లకావత్ మహేష్, బాలాజీపేట  గ్రామ శాఖ అధ్యక్షులు కోడి శ్రీనివాస్, బాలజీపేట బూత్ ఎన్రోలర్ బండి యాదగిరి గౌడ్, తిరుమల సుధాకర్ రెడ్డి రామగిరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.