బయ్యారం ఉక్కు పరిశ్రమను తెలంగాణలోనే ఏర్పాటు చేయాలి
బజార్ హత్నూర్ : బయ్యారం ఉక్కు గనుల పరిశ్రమను తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బంజారాహక్కుల సంఘం నాయకులు, తెరాస నాయకులు తహసీల్దార్‌కు వినతపత్రం అందజేశారు. తెరాస మండల కన్వీనర్ లింగన్న మాట్లాడుతూ బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కుని ఇక్కడి నుంచి ఈ పరిశ్రమను విశాఖకు తరలించేందుకు సీమాంధ్ర నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉక్కు పరిశ్రను తెలంగాణ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.



