బయ్యారం గనులను పరిశీలించిన తెదేపా నేతలు
బయ్యారం, జనంసాక్షి: తెదేపా నేతలు బయ్యారం ఇనుప రాయి గనులను పరిశీలించారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో మహా ధర్నా కర్యాక్రమం అనంతరం ఈ గనులను పరిశీలించారు. తెదేపా ఫోరం నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ,ఎంపీలు , ఎమ్మెల్సీ సభ్యులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.