బయ్యారానికి బస్సు యాత్ర చేపట్టిన తెదేపా నేతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెదేపా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు బయ్యారానికి బస్సు యాత్ర చేపట్టారు. అసెంబ్లీ నుంచి వీరు బస్సు యాత్రగా బయ్యారానికి చేరుకుని అక్కడ ఆందోళన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో అన్ని ప్రాంతాల తెదేసా నేతలది ఒకే మాట అని అన్నారు. రక్షణ స్టీల్స్‌కు బయ్యారం గనుల కేటాయింపు రద్దు తెదేపా పోరాట ఫలితమే అని చెప్పారు. బయ్యారంలో ప్లాంట్‌ పెట్టాలని, విశాఖ స్టీల్స్‌కు ఓబుళాపుపరం గనులు వైఎస్‌ ఎందుకు కేటాయించారో షర్మిల చెప్పాలని మరో నేత మండవ డిమాండ్‌ చేశారు.