బరితెగించిన పాకిస్థాన్..
ఎల్‌ఓసీ వెంబడి పాక్ దురాగతం
మూడు సెక్టార్‌లలో కాల్పులు..
అమరులైన ముగ్గురు సైనికులు,ముగ్గురు ప్రజలు
శ్రీనగర్,నవంబర్13 (జనంసాక్షి) : నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దురాగతాలు పెచ్చువిూరుతున్నాయి. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ సైన్యం ఉల్లంఘిస్తోంది. సామాన్యులు నివసించే ప్రాంతాలపై కూడా ఇష్టానుసారం కాల్పులు జరుపుతోంది. శుక్రవారం పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులు కాగా, ముగ్గురు సామాన్యులు అసువులుబాశారు. జమ్మూక్ఖశ్మీరులోని గురేజ్ సెక్టర్ నుంచి ఉరి సెక్టర్ వరకు జరిగిన కాల్పుల్లో ఈ దారుణాలు జరిగాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్థాన్ దళాల కాల్పుల్లో ఉరి సెక్టర్‌లో ఇద్దరు భారత సైనికులు, హాజీ పీర్ సెక్టర్‌లో బీఎస్‌ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాకేశ్ దోవల్ అమరులయ్యారు. ఉరి సెక్టర్‌లోని కమల్‌కోట్‌లో ఇద్దరు సాధారణ పౌరులు, బాల్‌కోట్‌లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు.
రక్షణ శాఖ అధికార ప్రతినిథి తెలిపిన వివరాల ప్రకారం నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాట్ల కోసం పాకిస్థాన్ దళాలు ప్రయత్నించాయి. దీనిని భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయి. బందిపొర జిల్లాలోని గురేజ్, కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టర్లలో పాకిస్థాన్ దళాలు కాల్పులు జరిపాయి.
పాకిస్థాన్ దళాలు కేరన్ సెక్టర్‌లో మోర్టార్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ దళాల దుశ్చర్యలను భారతీయ దళాలు దీటుగా తిప్పికొట్టినట్లు తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు జరగడం ఈ వారంలో ఇది రెరడోసారి అని పేర్కొన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో జరిగిన
చొరబాటు యత్నాలను తిప్పికొట్టి, ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. మొత్తం విూద ఈ ఏడాది ప్రారంభం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన సంఘటనలు దాదాపు 3,800 నమోదయ్యాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇదిలావుంటే జమ్మూకశ్మీరులోని కుప్వారాలో ఇంటర్నెట్ సర్వీసులను అధికారులు నిలిపివేశారు. నియంత్రణ రేఖ వెంబడి కేరన్ సెక్టర్‌లో శుక్రవారం ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భారత సైన్యం విఫలం చేసిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఇదిలావుండగా ఉత్తర కశ్మీరులో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. బందిపొర జిల్లాలోని గురేజ్ సెక్టర్, ఇజ్‌మార్గ్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ సంఘటన జరిగిన కొద్ది క్షణాలకే కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టర్‌లోనూ, బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టర్‌లోనూ పాకిస్థాన్ దళాలు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనల్లో ప్రాణహాని జరిగినట్లు సమాచారం లేదు. ఈ మూడు సెక్టర్లలోనూ భారత సైన్యం దీటుగా స్పందించి, పాకిస్థాన్ దుశ్చర్యను నిలువరించిందని అధికారులు తెలిపారు. కేరన్ సెక్టర్‌లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తించి, చొరబాట్లను నిరోధించినట్లు చెప్పారు. పాకిస్థాన్ దళాలు కేరన్ సెక్టర్‌లో మోర్టార్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసినట్లు తెలిపారు. పాకిస్థాన్ దళాల దుశ్చర్యలను భారతీయ దళాలు దీటుగా తిప్పికొట్టినట్లు తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు జరగడం ఈ వారంలో ఇది రెరడోసారి అని పేర్కొన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో జరిగిన చొరబాటు యత్నాలను తిప్పికొట్టి, ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు.