బల్లి పడిన పాలు తాగి 50 మంది విద్యార్థులకు అస్వస్థత
తిరుపతి: ఎస్పీ శిల్పకళాశాలలో బల్లిపడిన పాలు తాగి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే తితిదే కేంద్రీయ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 10మంది విద్యార్థులుకు ఐవీ ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని చీఫ్ మెడికల్ అధికారి తెలియజేశారు. విద్యార్ధులు భయాందోళనలో ఉన్నారని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.