బస్తీ బాట పట్టిన బోర్డ్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అక్టోబర్ 14 ( జనం సాక్షి )భారతీయ జనతా పార్టీ బస్తీ బాట కార్యక్రమం లో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు జె రామకృష్ణ వివిధ ప్రాంతాల్లో బస్తీ బాటలో భాగంగా ఐదవ వార్డు లోని వాసవీ కాలనీ సందర్శించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు, విరిగిపోయిన మ్యాన్ హోల్స్‌పై నిర్వాసితులు ఫిర్యాదు చేశారు, కమ్యూనిటీ హాల్ సమీపంలో కొత్త లైన్లు వేయాలని, దెబ్బతిన్న మ్యాన్‌హోల్స్‌ను మార్చడం ద్వారా స్టాట్ వర్క్ చేయాలని అధికారులను ఇంజనీర్ మరియు కాంట్రాక్టర్ ను సభ్యుడు ఆదేశించారు, తమ సమస్యపై ఆయన వెంటనే స్పందించడం పట్ల స్థానికులు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.