బస్సు -ఆటో ఢీ, ఐదుగురికి తీవ్రగాయాలు

నిజామాబాద్‌, జనంసాక్షి: నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం గొడికోలు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు, ఆటో ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.