బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే ఇకపై నేరమే
మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి అదేశాలమేరకు పట్టణంలోని బహిరంగ ప్రదేశాలలో,ఖాళీ ప్రదేశాలలో అపరిచితులు చెత్త పడవేసి అపరిశుభ్రతకు పాల్పడి, పట్టణ ప్రజల అనారోగ్యానికి కారకులు అయిన వారిని చెత్తలో దొరికిన ఆధారాలతో గుర్తించి జరిమానా విధించి తగిన అవగాహన కల్పించి అప్పటికి కూడా అదేవిధంగా మరల చెత్త బహిరంగ ప్రదేశాలలో పడవేసినట్లైతే మున్సిపల్ చట్టప్రకారం శిక్షార్హులను చేయవలసిందిగా ఆదేశించారు.ఇట్టి క్రమంలో ఈరోజు శుభోదయ పాఠశాల వద్ద చెత్తలో లభించిన ఆధారాలతో వారిని గుర్తించి తగిన జరిమాన విధించడంతో పాటు మరొకసారి చెత్త వేయకుండా అవగాహన కల్పించి, మరొకసారి ఇలా జరిగినట్లైతే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించనైనది. సానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ సానిటరీ సిబ్బందితో కలిసి శేఖర్,మాధవి, సుశాంత్,బి.మహేష్ లు బహిరంగ ప్రదేశాలలో వేసిన చెత్తలో లభించిన తదితర ఆధారములతో వారియొక్క నివాస ప్రాంతాలను గుర్తించి వారికి జరిమానా విధించి చెత్తవేయకుండా ఉండాలని అవగాహన కల్పించడం జరిగింది.సానిటరీ ఇన్స్పెక్టర్ గారితో జవాన్ లు భాను శివ,బాబు,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.