బహిరంగ మలవిసర్జనతో అంటువ్యాధులు
నిజామాబాద్,జూన్22(జనం సాక్షి ): అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని వినియోగించుకోవాలన్నారు. బహిరంగ మలవిసర్జన కారణంగా అంటువ్యాధులు ప్రబలుతున్నాయని గుర్తుంచుకోవాలన్నారు. అదేవిధంగా స్థలం ఉన్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకొని, ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. బహిరంగ మలవిసర్జన వల వాటిపై మనమే నడవడ, ఆ చెత్తఇళ్ళల్లోకి రావడ వల అనేక రోగాలకు ఆతిధ్యయం ఇస్తున్నామని పేర్కొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి నలుగురు కూలీలకు, ఇద్ధరు పుణ్యంగల కూలీలకు చెల్లించే మొత్తాన్ని ఉపాధి హామి పధకం ద్వారా అదనంగా మంజూరుచేస్తున్నామని తెలిపారు. గ్రామం పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. పారిశుద్ద్యయ నిర్వహణకు ప్రజలు ముందుకు రావాలని జిల్లా కలెక్టరు పిలుపునిచ్చారు. బహిరంగ మలవిసర్జన సభ్య సమాజంలో వెనుకబాటు సూచిస్తుందని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ద్య పనులు చేయించామని, వాటిని గ్రామస్తులు నిర్వహించుకోవాలని అన్నారు. ఇళ్ళల్లో చెత్తను రహదారులపై, రహదారులపై చెత్తను ఊరు మధ్యలో వేయరాదని అన్నారు. వర్మికంపోస్టు యూనిట్లను ఉపాధి హామి పధకం క్రింద మంజూరుచేస్తున్నామని, మన చెత్తతో దానిని నిర్వహించుకునిసేంద్రియను ఎరువులను తయారుచేయవచ్చని ఆయన చెప్పారు.