బహుజన రాజకీయాల వేగుచుక్క కాన్షీరాం

బహుజన రాజకీయాల వేగుచుక్క కాన్షీరాం

చిన్నంబావి అక్టోబర్ 9 జనం సాక్షిచిన్నంబావి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మాన్యశ్రీ కాన్షీరాం 17వ వర్ధంతి సందర్భంగా బీఎస్పీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బి.ఎస్.పి మండల అధ్యక్షుడు బొల్లి కురుమయ్య మాట్లాడుతూ ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు రాజకీయ స్పృహను కల్పించి అధికారంలోకి వస్తారని నిరూపించిన వారు మాన్యశ్రీ కాన్సీరామ్ ఆయన పంజాబ్ రాష్ట్రం రొపాల్ జిల్లాలో మారుముల గ్రామం కావాస్పూర్ లో జన్మించారు, పూలే, సాహూ, నారాయణ గురు, పెరియర్, బాబాసాహెబ్ అంబేద్కర్, కన్న కలలను సహకారం చేయాలని నిర్ణయించుకొని ఉద్యోగులను కార్మికులను చైతన్యం చేసి తద్వారా బీఎస్పీ పార్టీని స్థాపించి భారతదేశంలో ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేసి అణగారిన కులాలలో రాజకీయ చైతన్యాన్ని నింపిన బలమైన రాజకీయ ఉద్యమాన్ని రగిలించిన గొప్ప వ్యక్తి కాన్సిరాం అన్నారు, బీసీల సమస్యను భారతదేశ సమస్య అని గుర్తించి మన మహాపురుషుల ఆశయాల బాటలో బీసీ, ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీలకు బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ ని పెట్టి మనువాద రాజకీయా పార్టీలకు చెక్కుపెట్టిన రాజకీయ గౌతమ బుద్ధుడు మాన్యశ్రీ కాన్సిరాం అన్నారు. బహుజనులను ఓటు వేసే మనుషులుగా మల్చిన మనువాదులపై రాజకీయ యుద్ధం ప్రకటించి ఆ యుద్ధ రంగంలో విజేతలుగా నిలిచి రాజకీయానికే నూతన భవిష్యత్తు నిచ్చిన వైతాళికులు కాన్సిరాం దేశంలో బహుజనులకు రాజ్యాధికారం దక్కితేనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొనసాగుతుందన్నారు. భారతదేశంలో బహుజనులకు రాజ్యాధికారంలో రావలసిన వాటా రాకపోవడం, ఆధిపత్య పాలకుల కుట్రలో భాగమే దేశంలో అధికారం రాకుండా ఆత్మగౌరవం సంపద రాదని ఈ మూడు ఓటుతోనే సాధ్యమని బహుజనుల కోసం బీఎస్పీ పార్టీని స్థాపించి ఉత్తరప్రదేశ్ లో మాయావతిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేసి గద్దెనెక్కి‌ఎంతో ఆదర్శంగా నిలిచారని కాన్షిరాం ను కొనియాడారు. దళితులు రాజకీయంగా ఎదిగితే భవిష్యత్తు ఉంటుందన్నారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రకులాల్లో పేదలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే బీఎస్పీ అధినేత్రి మాయావతిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడమే శరణ్యమన్నారు. బహుజనుల అభ్యున్నతికి కాన్సిరాం చేసిన కృషి ఎనలేనిది అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క బహుజనుడు కృషి చేయాలన్నారు. అనంతరం హైదరాబాదులో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే కాన్సిరాం వర్ధంతి సభకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు భాను, ప్రధాన కార్యదర్శి పవన్, కోశాధికారి రామకృష్ణ, బివియఫ్ కన్వీనర్ సాయికుమార్, పార్టీ సీనియర్ నాయకులు విధాత, బాలు, చంద్రమౌళి, శివ, దామోదర్ శ్రీను, బాలకృష్ణ, నాగరాజు, దానిల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.