బాంబు దాడులను నిరసిస్తూ రాస్తారోకో
దంతాలపల్లి: హైదరాబాద్‌లో జరిగిన బాంబు దాడులను నిరసిస్తూ నరసింహులపేట మండలం దంతాలపల్లిలో భాజపా, ఏబీవీపీ, ఎన్‌ఎఫ్‌ఐల ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బాంబు దాడులకు
పాల్పడిన దుండగులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా మండలాధ్యక్షులు చీకటి మహేష్, ఎన్‌ఎఫ్‌ఐ నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.