బాణాసంచా 2గంటల పాటు మాత్రమే కాల్చడం సాధ్యామా

ప్రజలను అలా కంట్రోల్‌ చేయగలమా అని పోలీసుల అనుమానం

చెన్నై,నవంబర్‌1(జ‌నంసాక్షి): దీపావళి సందర్భంగా రెండు గంటలపాటు మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీంకోర్టు నిబంధనను విధించిన నేపథ్యంలో దీనిని అమలు చేయడం సాధ్యంకాదని పోలీస్‌ అధికారులు భావిస్తున్నారు. ప్రతి ఏడాది దీపావళికి ఒక సందేశాన్ని విడుదల చేస్తారు. 2005లో సుప్రీంకోర్ట్‌ ఇచ్చిన తీర్పుమేరకు రాత్రి 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు బాణాసంచా కాల్చకూడదని, అలాగే ఆ సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు విూడియా ద్వారా సందేశాన్నిస్తారు. అయితే చాలా తక్కువ మంది వీటిని పాటించేవారని వారు తెలిపారు. మరికొంతమంది పది దాటినా వీధులలో, ఇళ్ల టెర్రస్‌లపై బాణాసంచా కాలుస్తూనే ఉండేవారని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఈ నిబంధనను అమలు చేయడం కష్టతరమని అధికారులు తెలిపారు. అయితే ఏదిఏమైనా సుప్రీంకోర్టు విధించిన ఈ నిబంధనను అమలు చేసేందుకు కృషి చేస్తామని కమిషనర్‌ ఎకె.విశ్వనాథన్‌ తెలిపారు.