బాధితురాలి అంత్యక్రియలు పూర్తి
న్యూఢిల్లీ : దేశరాజధానిలో సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి అంత్యక్రియలు ఈ ఉదయం ఢిల్లీలో నిర్వహించారు. మృతదేహాన్ని సింగపూర్ నుంచి ఢిల్లీకి తరలించినకొద్ది గంటల్లోనే అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తిచేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఆర్‌పీఎస్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంత్యక్రియలకు మీడియాను అనుమతించలేదు. అంతకుముందు ఢిల్లీ విమానాశ్రంలోనే బాధితురాలి మృతదేహానికి ప్రధాని మన్మోహస్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాళులు ఆర్పించారు.