బాధితురాలి చికిత్స వారాలు పట్టటవచ్చు : కేంద్ర హోంశాఖ
గురువారం ఉదయానికి సింగపూర్ చేరుకున్న బాధితురాలు
న్యూఢిల్లీ : ఢిల్లీ సంఘటన బాధితురాలి చికిత్స కొన్ని వారాలపాటు పట్టవచ్చని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఎన్ని వారాలైనా ఆమె చికిత్స ఖర్చు భారత ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. పదిరోజుల క్రితం సామూహిక అత్యాచారానికి గురైన పారామెడికల్ విద్యార్ధిని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో రాత్రి సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులతో పాటు వైద్య బృందం ఎయిర్ అంబులెన్స్‌లో సింగపూర్ చేరుకున్నారు. ఆమె పరిస్థితిని నిపుణుల బృందం అంచనా వేస్తోందని, చికిత్స కొనసాగుతోందని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రివర్గాలు తెలిపాయి.