బాధ్యతలు చేపట్టిన కొప్పుల
హైదరాబాద్,ఫిబ్రవరి24(జనంసాక్షి): సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డీ బ్లాక్ లో పండితుల ఆశీర్వచనాల మధ్య.. ఆయన బాధ్యతలు చేపట్టారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొప్పుల ఈశ్వర్ కు మంత్రులు ఈటెల రాజేందర్, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.