బాపూజీ, శాస్త్త్రీలకు ఢిల్లీలో ఘన నివాళి
న్యూఢిల్లీ,అక్టోబర్2(జనంసాక్షి):
జాతిపిత మహ్మాత్మగాంధీ, మాజీ ప్రధానమంత్రి దివంగత లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆ మహానుభావులకు నివాళి అర్పించారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,ప్రధాని నరేంద్రమోదీ నేడు ఇరువురికి నివాళులర్పించారు. మహాత్ముడి 146వ, శాస్త్రి 111వ జయంతి నేడు. రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హవిూద్ అన్సారీ,ప్రధాని మోడీ తదితరులు నివాళులర్పించారు. అనంతరం రాజ్‌ఘాట్ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.మాజీ ప్రధాని లాల్‌బహదుర్ శాస్త్రి జయంతి సందర్భగా శుక్రవారం విజయ్‌ఘాట్‌లో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, భాజపా అగ్రనేత ఎల్.కె.అడ్వాణి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు లాల్‌బహదుర్ శాసౄకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ.. బాపు కలైన స్వచ్ఛతకు మేం నిబద్దులమై ఉన్నాం. స్వచ్ఛభారత్ కార్యక్రమం అభివృద్ధికి బాటలు వేయడంతో పాటు పేదల సంక్షేమానికి ఉపకరిస్తుంది. భారత ముద్దు బిడ్డ లాల్‌బహదూర్ శాస్త్రికి నా వందనాలు. సహజత్వానికి, సమగ్రతకు శాస్త్రిజీ పెట్టింది పేరు. పరీక్ష కాలంలో వారి నాయకత్వం భారత్‌ను సుసంపన్నం చేసింది. జై జవాన్..జై కిసాన్ అన్న శాస్త్రిజీ నినాదంనుంచి మేం ఎప్పటికీ స్ఫూర్తిపొందుతూనే ఉంటాం. ఇదే స్ఫూర్తితో సైనికుల, రైతుల సంక్షేమం కోసం కృషిచేస్తామని ప్రధాని పేర్కొన్నారు.