బాబుకు నోటీసు ఇచ్చే అధికారం ఏసీబీకి ఉంది

2

– దినేష్‌ రెడ్డి

హైదరాబాద్‌,జూన్‌18(జనంసాక్షి):  స్పష్టమైన ఆధారాలుంటే ఏసీబీ ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చని మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు దినేష్‌ రెడ్డి చెప్పారు. అలాగే ఎపిలో సిట్‌ వ్యవహారాలు హైదరాబాద్‌లోనే విచారించాల్సి ఉంటుందన్నారు. గురువారం ఆయన గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. అనంతరం తనను కలిసిన విూడియాతో మాట్లాడారు.  నోటీసులు ఇవ్వడానికి ¬దాలతో సంబంధం లేదని, అలాగే అందుకు ఎవరి పర్మిషన్లు కూడా అవసరం లేదని వ్యాఖ్యానించారు. చట్టం పరిధిలో ఉన్న అంశాలపై గవర్నర్‌ కూడా జోక్యం చేసుకోలేరని ఆయన అన్నారు. సిఆర్‌పిసి ప్రకారం నడుచుకునే హక్కు ఎసిబికి ఉందన్నారు.ఫోన్‌ ట్యాపింగ్‌ విూద కేంద్రం సుమోటోగా జోక్యం చేసుకోబోదని అన్నారు. ఇలా జోక్యం చేసుకునే అంశం కూడా కాదన్నారు.  నోటీసులు ఇచ్చే అంశం తెలంగాణ ఏసీబీ పరిధిలోనే ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల స్వేచ్ఛకు, ఆస్తులకు రక్షణ లేకపోతే సెక్షన్‌-8లో గవర్నర్‌ జోక్యం చేసుకుంటారని దినేష్‌ రెడ్డి వివరించారు. అంతేతప్ప మొత్తం శాంతి భద్రతలు పూర్తిగా గవర్నర్‌ చేతుల్లోకి వెళ్లవన్నారు. రాష్ట్రపతి పాలనలో మాత్రమే గవర్నర్‌కు  పూర్తి అధికారాలు ఉంటాయని తెలిపారు. శాంతిభద్రతలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు గవర్నర్‌కు చేయవచ్చన్నారు.  హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులపై దాడులు జరిగితే గవర్నర్‌ జోక్యం చేసుకుంటారన్నారు. హైదరాబాద్‌ ప్రశాంతంగానే ఉందని, ఇక్కడి సీమాంధ్ర ప్రజలపై ఎక్కడా దాడలుగానీ, బెదిరింపులుగానీ జరిగినట్లు ఎక్కడా చూడలేదని ఆయనన్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు అదుపు తప్పితే సెక్షన్‌ 8 ప్రకారం గవర్నర్‌ జోక్యం చేసుకోవచ్చని ఆయన వివరించారు. చట్టపరిధిలో ఉన్న అంశాలపై గవర్నర్‌ సైతం జోక్య చేసుకోరని దినేష్‌రెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసులో నోటీసులిచ్చే అంశం తెలంగాణ ఏసీబీ పరిధిలోకి వస్తుందని, ఆ అధికారం వారికే ఉంటుందని మాజీ డీజీపీ చెప్పారు. ఇక ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో కేంద్రం సూమోటోగా జోక్యం చేసుకోదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై కేసు పెట్టినా హైదరాబాద్‌లోనే పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎందుకంటే తప్పు హైదరాబాద్‌ కేంద్రంగా జరిగిందని భావిస్తున్నారు కనుక ఇక్కడి నుంచి విచారణ చేయాల్సి ఉంటుందన్నారు.