బాబు..! ఆ గొంతు నీదా ? కాదా ?

3

– హరీష్‌ సూటి ప్రశ్న

నల్లగొండ, జూన్‌15(జనంసాక్షి):

చంద్రబాబు బుకాయింపులు ఆపి ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు ఆయనదో కాదో చెప్పాలని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో తప్పు ఒప్పుకోకుండా తప్పించుఏకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేగాకుండా ఎదరు కేసులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఇదొక్కటే చాలని వారుతప్పు చేసారనడానికని మంత్రి అన్నారు. అడ్డంగా వీడియోల్లోచ ఆడియోల్లో దొరికిన తరవాత కూడా ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే ప్రజలు అమాయకులు కారని గుర్తుంచుకోవాలన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తప్పుచేసినట్టు ఒప్పుకోవాలని మంత్రి హరీష్‌రావు సూచించారు.  ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే నానా రభస చేస్తున్నడని మండిపడ్డారు. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని లేకపోతే తప్పు చేసినట్టు అంగీకరించాలని బాబుకు హితవు పలికారు. చంద్రబాబు తప్పు చేసినందుకే ఢిల్లీలో గడపగడపకు తిరుగుతున్నారని తెలంగాణ మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. 2007లోనే నక్కలగండి ప్రాజెక్టుకు వైఎస్‌ జీవో ఇచ్చారని, తండ్రినే ఆదర్శమంటున్న జగన్‌.. కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని మంత్రి ప్రశ్నించారు.  నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ఆధునీకరణపనులను మంత్రుల బృందం పరిశీలిచింది. అనంతరం మంత్రి హరీష్‌ రావు విూడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్ర నాయకత్వం మొదటి నుంచి వివక్ష చూపుతోందని ఆరోపించారు. వైఎస్‌, చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. వైఎస్‌ హయాంలోనే నక్కలగండి పై జీవో విడుదలైందని… నక్కలగండి ప్రాజెక్టును నిలిపివేయాలని టీడీపీ, పాలమూరు ఎత్తిపోతలను నిలిపివేయాలని జగన్‌ కేంద్రానికి లేఖ రాయడం వారి వివక్షతకు నిదర్శనమని మండి పడ్డారు.